జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 30 వార్డులలోగల 100 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను బుధవారం స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలో మండల తహసిల్దార్ రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విచ్చేసి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. చెక్కుల పంపిణీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మరియు ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు. కోర్టుకు వెళ్లి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివాహము అయినటువంటి లబ్ధిదారులకు లక్ష 116 రూపాయల తో పాటు తులం బంగారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, మునిసిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నకోటి, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్,, సింగిల్ విండో అధ్యక్షులు పొన్నగంటి సంపత్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.