పేదలకు కళ్యాణ లక్ష్మి పథకం వరం లాంటిది

Kalyana Lakshmi scheme is like a boon for the poor– చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే 
నవతెలంగాణ – అచ్చంపేట 
పేదల ఇంట్లో ఆడ కూతురు పెళ్లి జరుగుతే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం అమలు చేయడం జరుగుతుంది. పేదల ఇంట్లో అమ్మాయి పెళ్ళికి రూ.1లక్ష16 వేలు మంజూరు చేయడం జరుగుతుందని ఎంపీ మల్లు రవి, వంశీకృష్ణ తెలిపారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే అంబేద్కర్ ప్రజాభవన్లో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 450 మంది షాదీ ముబారక్, కళణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రతి పేద కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు,  కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతటి మల్లేష్, గోపాల్ రెడ్డి, కట్టా అనంతరెడ్డి, తదితరులు ఉన్నారు.