కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

నవతెలంగాణ – నాగిరెడ్డి పెట్
నాగిరెడ్డిపేట మండలానికి చెందిన 35 మంది కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ లబ్ధిదారులకు బుధవారం రోజు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు క్యాంప్ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాగిరెడ్డిపేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దివిటి కిష్టయ్య, మైనార్టీ అధ్యక్షులు ఇమామ్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్,  సురేందర్ గౌడ్,  సంగమేష్ , ధనుంజయ తదితరులున్నారు.