మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ధర్మసాగర్ మరియు వెలేరు మండలాలకు చెందిన 72 మంది లబ్ధిదారులకు 72 లక్షల 8 వేల 352 రూపాయల విలువగల కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు.ముఖ్యంగా వ్యవసాయాన్ని పండుగ చేయ డానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగా రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, పంటల బీమా పథకాలతో రైతన్నలను ఆదుకుంటుందన్నారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సదానందం, ఎంపీడీవో అనిల్ కుమార్, నాయకులు ఎర్రవెల్లి శరత్, గుర్రపు ప్రసాద్, రాజు యాదవ్, వనమాల, బొడ్డు కుమార్, యాదగిరి, రమేష్, మల్లిక్పా, తదితరులు పాల్గొన్నారు.