కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ నియేాజక వర్గంలోని పలు మండలాల లబ్దిదారులకు ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్ చేతుల మీదుగా  కళ్యాణ లక్ష్మీ, శాదీముబారక్ చెక్కులను ఆదివారం నాడు పంపిణి చేసినట్టు జుక్కల్ మండల కాంగ్రేస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. వీనోద్ తెలిపారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ క్రమంలో వివిధ మండలాల నుండి లబ్దిదారులు తరలి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథాకాలకు కట్టుబడి ఉందని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ తహసీల్దార్ హిమబిందు, ఆర్ఐ రామ్ పటేల్, మండల కాంగ్రేస్ సీనీయర్ నాయకుడు కేమ్రాజ్ కల్లాలీ మాజీ సర్పంచ్ రమేష్ దేశాయి, వివిధ మండలాల కాంగ్రేస్ ప్రజాప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.