రామారెడ్డి మండలంలోని అన్నారం, పల్వంచ రైతు వేదికల్లో కామారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపల్లి వెంకట రమణారెడ్డి కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. రామారెడ్డి మండలంలోని ఉమ్మడి రెడ్డి పేట గ్రామపంచాయతీ పరిధిలో 19, అన్నారం 4, మద్దికుంట 2 కళ్యాణ లక్ష్మి చెక్కులను, సింగరాయ పల్లి, మద్దికుంట, అన్నారం, రెడ్డిపేట తదితర గ్రామాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో సువర్ణ, ఎంపీడీవో తిరుపతి రెడ్డి, ఆర్ ఐ వెంకట్ రాజు, పంచాయతీ కార్యదర్శి సాగర్ గౌడ్,సింగరాయి పల్లి ఫీల్డ్ అసిస్టెంట్ నరేందర్ గౌడ్,బిజెపి నాయకులు గోపు గంగారాం, ఫిఫా వత్ తిరుపతి నాయక్, ము దాం దశరథ్, కుమ్మరి రాజశేఖర్, ఎం బేరి శంకర్ తదితరులు ఉన్నారు.