నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని కమలాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి సస్పెన్షన్ చేస్తున్నట్లు ఎంపీడీవో సాజిద్ అలీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన గత కొంతకాలంగా విధులకు గైర్హాజరు కావడంతోపాటు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండడంతో విధుల నుండి తాత్కాలికంగా సస్పెన్షన్ చేస్తున్నట్లు ఎంపీడీవో సాజిద్ అలీ తెలిపారు. ఉపాధి హామీ విధుల పట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యంగా వహిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.