ఫైట్‌ మాస్టర్స్‌ అన్బరివ్‌ దర్శకత్వంలో కమల్‌ 237వ సినిమా

ఫైట్‌ మాస్టర్స్‌ అన్బరివ్‌ దర్శకత్వంలో కమల్‌ 237వ సినిమాకమల్‌ హాసన్‌ ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్‌లో గ్యాంగ్‌ స్టర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘థగ్‌ లైఫ్‌’ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఏకధాటిగా జరుగుతోంది. ఇదిలా ఉంటే, కమల్‌ తన 237వ చిత్రానికి సంబంధించి ఓ ప్రకటన చేశారు. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌లు అన్బరివ్‌(అన్బుమణి, అరివుమణి) దర్శకత్వంలో కమల్‌ 237వ సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్ని కమల్‌ హాసన్‌ తెలియజేస్తూ, ‘ఇద్దరు ప్రతిభావంతులు, వారి కొత్త అవతార్‌లో నా 237వ చిత్రానికి దర్శకులుగా చేరడం గర్వంగా ఉంది. మాస్టర్స్‌ అన్బరివ్‌… రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌కి తిరిగి స్వాగతం’ అని ట్వీట్‌ చేశారు. కమల్‌ హాసన్‌, ఆర్‌ మహేంద్రన్‌ తమ రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.