
బంగ్లాదేశ్ లో గత వారం రోజువులుగా ఇందులో పై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం చత్రపతి శివాజీ మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్మర్ పల్లి మండల బంద్ విజయవంతం అయ్యింది.చత్రపతి శివాజీ మహారాజ్ యువసేన పిలుపుమేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉదయం నుండి వ్యాపార, వాణిజ్య, సముదాయాలను మూసి ఉంచారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా బంద్ కు మద్దతుగా తమ పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. ప్రతినిత్యం కోలాహాలంగా ఉండే మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతమంతా బంద్ తో నిర్మానుష్యంగా మారింది.చత్రపతి శివాజీ మహారాజ్ యువసేన సభ్యులు మాట్లాడుతూ గత వారం రోజులుగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లలో అమాయక హిందూ యువకులను, మహిళలను, పసి పిల్లలను, వృద్ధులను చంపుతున్న బంగ్లాదేశ్ నరరూప రాక్షసుల చర్యలను ఖండిస్తున్నామన్నారు. హిందువుల ఆస్తులను దోచుకుంటూ, తగలబెడుతూ హిందువుల మందిరాలను కులగోడుతున్న అరాచక శక్తులపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. బందు పిలుపుకు స్పందించి సహకరించిన మండల ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.