ఫుట్ బాల్ టోర్నమెంట్ పోటీలకు ఎంపికైన కామారం యువకులు

నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కామారం(పిటి) గ్రామానికి చెందిన చందా విజయ్, సందీప్, కొర్నెబెల్లి వంశీ, అజయ్, ప్రదీప్, దిలీప్, భాను, గొంది శేఖర్, మహిపతి అరవింద్, కాక నిఖిల్, నితిన్ అనే పదకొండు మంది యువకులు ఎంపికైనట్లు బిర్సా ముండా ఎంప్లాయిస్ సభ్యులు మహిపతి సంతోష్ కుమార్, రేగ కిరణ్ కుమార్ లు తెలిపారు. వీరికి శుక్రవారం షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిర్సా ముండా యూత్ నాయకులు సంతోష్ కుమార్, రేగ కిరణ్ కుమార్ లు మాట్లాడుతూ క్రీడల వలన ఆరోగ్యంతో పాటు జాతీయభావం పెంపొందుతుందని తెలిపారు. కామారంలో చాలామంది యువకులకు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిర్సా ముండా సభ్యులు దనసరి సతీష్ కుమార్, చందా ప్రవీణ్ కుమార్, కొర్నెబెల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.