కామారెడ్డి నియోజకవర్గ, రామారెడ్డి మండల గ్రామాలైన మద్దికుంట, రెడ్డిపేట్, అన్నారం , పలు తాండాల గ్రామపంచాయతీలకు చెందిన 20 కళ్యాణ లక్ష్మి, 6 సీఎం సహాయ నిధి చెక్కులను కామారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు కాట్పల్లి వెంకటరమణారెడ్డి మంగళవారం అన్నారం రైతు వేదికలో లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో సువర్ణ, ఎంపీడీవో తిరుపతిరెడ్డి, ఆర్ఐ రవికాంత్, పంచాయతీ కార్యదర్శి సాగర్ గౌడ్, ఏఈఓ శ్రీనివాస్, బిజెపి నాయకులు గోపు గంగారం, రాజశేఖర్, సాయిరాం గౌడ్, నరేష్, ముత్యాల రాజు, తదితరులు ఉన్నారు.