నవతెలంగాణ – కామారెడ్డి
ఈనెల తేదీ 19.01.2025 రోజు ఉదయం రామారెడ్డి పిఎస్ పరిధిలోని అన్నారం గ్రామంలో ఒక మగ వ్యక్తి అతడి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయినాడు అని సమాచారం రాగా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతుడు అన్నారం గ్రామానికి చెందిన పొక్కిలి రవి ( 41 ) ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పినట్లు గుర్తించి కేసు నమోదు చేసుకోవడం జరిగిందని ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం కామారెడ్డి రూరల్ సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామారెడ్డి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కేసులో కామారెడ్డి ఎస్పీ ఉత్తర్వుల మేరకు, ఏఎస్పి కామారెడ్డి టీమ్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతంగా చేసి అయిదుగురు నిందితులను పట్టుకొని విచారించగా వారు చేసిన నేరమును ఒప్పుకున్నారు. మృతుని అన్న పొక్కిలి కిష్టయ్య భూ తగదాల విషయంలో కిరాయి అంతకుల ను తీసుకొని హత్య చేసినట్లు వారు తాము జరిపిన విచారణలో ఒప్పుకున్నట్లు ఆమె తెలిపారు. అట్టి అయిదుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక సుత్తె, ఒక కర్ర, రెండు మోటార్ సైకల్ లు, ఒక గొలుసు, 5 ఫోన్ లు 15వేల రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితుల వివరములు: రామారెడ్డి మండలం, అన్నారం గ్రామానికి చెందిన మృతుని అన్న పొక్కిలి కిష్టయ్య , అదే గ్రామానికి చెందిన పొక్కిలి కిషన్, కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన షేక్ ఆఫీజ్, మెదక్ జిల్లా రామాయంపట మండలం ఝాన్సిలింగాపూర్ గ్రామం, ప్రస్తుత నివాసం దోమకొండ కు చెందిన ( చాకలి ) నర్సోల్ల రాకేశ్, అన్నారం గ్రామానికి చెందిన పొక్కిలి సత్తెవ్వ నిందితులనీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొని మర్డర్ కేసుని చేదించిన కామారెడ్డి రూరల్ సి.ఐ. ఏస్.రామన్, రామారెడ్డి ఎస్సై వై.నరేష్, ఏ ఎస్ కే.రవీందర్ , క్రైమ్ టీం సిబ్బంది రవికిరణ్, సాయిలు, రాజు, బి. రమేశ్ లను జిల్లా ఎస్పీ, కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీసు అధికారి చైతన్య రెడ్డి అభినందించరు.