
– వరద ఎక్కువైతే తుము కొట్టుకుపోయే ప్రమాదం పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సింగాపూర్ లోని కాంబోజ చెరువుకు ప్రమాదం పొంచి ఉంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి కి చెరువు నిండిపోయింది, దీంతో తూము పక్కన పెద్ద బుంగ ఏర్పడింది. ఈ బుంగ గత ఎడాది పడడంతో రైతులు తాత్కాలికంగా పూడ్చి వేశారు. సంబంధిత అధికారులకు తెలియజేసిన తూతూ మంత్రంగా సర్వేలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ఈ సీజన్లోనైనా బుంగను లేకుండా పూడ్చుతారని రైతులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చిన కూడా పట్టించుకోలేదు. దీంతో గత వారం రోజుల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి రావడం చెరువు నిండిపోయింది. దీనిని గమనించిన రైతులు మట్టి పోసారు.ఇప్పటికైన అధికారులు స్పందించి బుంగ ను పూడ్చిలని లేకుంటే కట్ట తెగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బుంగ ను పూడ్చిలని రైతులు కోరుతున్నారు