అన్వేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కమ్మర్ పల్లి కాంగ్రెస్ నాయకులు 

Kammer Palli Congress leaders congratulated Anvesh Reddyనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
తెలంగాణా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా సోమవారం పదవి బాధ్యతలు చేపట్టిన సుంకేట అన్వేష్ రెడ్డిని మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు హైదరాబాద్ లో తెలంగాణా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా సుంకేట అన్వేష్ రెడ్డి బాధ్యతలు చేపట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ, పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణారాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తక్కురు దేవేందర్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు భువనగిరి భాస్కర్, ఎస్టీ సెల్ నాయకులు రాములు నాయక్, నాయకులు చింతకుంట శ్రీనివాస్, శ్రీనివాస్,తదితరులు ఉన్నారు.