కమ్మర్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గం

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 

కమ్మర్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల నుండి ఒక్కో సభ్యుడిని గ్రామ అభివృద్ధి కమిటీకి పంపించగా అందులో నుండి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ నూతన అధ్యక్షులుగా భోగ రామస్వామి, ఉపాధ్యక్షులుగా శివసాలం గణేష్, కోశాధికారిగా నూకల బుచ్చి మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా జైడి బాలకృష్ణ, సలహాదారులుగా కండక్టర్ రవీందర్, దూలూరి కిషన్ గౌడ్, తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులను ఇతర సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తమ వంతుగా పాటుపడతామన్నారు.గ్రామ సమస్యల పరిష్కారంలో ఎలాంటి వివక్షకు తావు లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు పోతామన్నారు. ఈ కార్యక్రమంలో సున్నం మోహన్, బద్దం రాజేష్, కొత్తపల్లి గణేష్, అంకోజి అంకిత్, భూమేశ్వర్, బాలు, తదితరులు పాల్గొన్నారు.