నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: దండు మల్కాపురం గ్రామపంచాయతీ మూడో వార్డు సభ్యుడు కంచర్ల అశ్విన్ రెడ్డి మునుగోడు క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కంచర్ల అశ్విన్ రెడ్డి తో పాటు 30 మంది యువకులను కండువా కప్పి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలోకి చంద్రశేఖర్, దాస్, ప్రవీణ్, లింగస్ వామి, మధుసూదన్, విజయ్, మల్లారెడ్డి, సాయి, వెంకట్ చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసమే మళ్లీ బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని తెలిపారు. కార్యక్రమంలో చౌటుప్పల్ జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పబ్బు రాజుగౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మునుకుంట్ల రాజుగౌడ్ వార్డు మెంబర్లు దేప శ్యాంసుందర్ ముదిరాజ్, ఈడ్డుల విజయ్ కుమార్, గంగాధర్ గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరి మల్లారెడ్డి, మహేష్, మహంకాళి రాజేష్ ఖన్నా, గుండ్ల శేఖర్, శివ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.