నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వసంత పంచమి పురస్కరించుకొని భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుండి ఉదయం నుంచి సుదూర ప్రాంతాల నుంచి వాహనాలపై భక్తులు విచ్చేసి పుణ్య స్థానాలను ఆచరించారు. కందకుర్తి గోదావరి నదిలోను రాతి శివాలయం నీటి తో మునిగి ఉండడంతో తీరంలోనున్న పుష్కర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.