- జైపూర్ లో చికిత్స
నవతెలంగాణ రెంజల్
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగం తీరంలో ఆలయాల నిర్మాత శ్రీ సీతారాం త్యాగి మహారాజ్ అనారోగ్యంతో అస్వస్థకు గురికాగా, ఆయనను జైపూర్ లో చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని భక్తులు పేర్కొన్నారు. కర్ణభేరి ఆపరేషన్ జరగడంతో అస్వతకు గురయ్యారని వారు పేర్కొన్నారు. ఆయన గత కొన్ని సంవత్సరాల క్రిందట గోదావరి తీరం నుంచి వచ్చి అక్కడే స్థిరపడి రామాలయం, హనుమాన్ మందిరం, శనీశ్వర దేవాలయం, లాంటి దేవాలయాలు నిర్మించి భక్తుల సేవలను అందిస్తున్నారు.