
రెంజల్ మండలం కందకుర్తి గోదావరి తీరాన నున్న సీతారాం త్యాగి మహారాజ్ ఆశ్రమంలో ఘనంగా గురు పౌర్ణమి పురస్కరించుకొని గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నీలా మాజీ సర్పంచ్ గౌరాజి లలిత రాఘవేందర్, కుటుంబ సభ్యులతో పటు, బోధన్ పట్టణానికి చెందిన సత్యం వారి స్నేహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతారాం త్యాగి వారిని ఆశీర్వదించి గోదావరి తీరానికి వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు బి రమేష్, డి. యోగేష్, రమేష్, సురేష్, శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, సింహరాయులు, మోహన్, తదితరులు పాల్గొన్నారు.