
విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ చేయడం అభినందన ఏమని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శిల్పకుంట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో సుమారు 93 మంది విద్యార్థులకు తెలంగాణ సాయుధ పోరాట యోధులు భీమిరెడ్డి నరసింహారెడ్డి, మద్ది కాయల ఓంకార్, మల్లు స్వరాజ్యం, తొట్ల మల్సూర్ జ్ఞాపకార్థం సర్కిల్ ఇన్స్పెక్టర్ బిక్కి గురవయ్య తన సొంత గ్రామ విద్యార్థులకు అందించే అందించే రూ.28 వేల రూపాయల విలువ చేసిన నోటు పుస్తకాలు పంపినని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని ప్రజా సేవలో రాణించాలని కోరారు. అనేకమంది మహానుభావులు చదువు లేకపోయినప్పటికీ సమాజాన్ని అర్థం చేసుకొని సమ సమాజ నిర్మాణం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. విద్యార్థులు పోటీపడి చదివి గ్రామానికి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎన్, సోంబాబు, రమేష్ రెడ్డి ఏఏపీసీ చైర్ పర్సన్స్ బాణాల సంధ్య బత్తుల రేణుక వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పులుసు సత్యం, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు తొట్ల ప్రభాకర్, ఎస్ డబ్ల్యూ ఎఫ్ జిల్లా కార్యదర్శి బత్తుల సుధాకర్ సీఐటీయూ మండల కార్యదర్శి బొజ్జ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.