వరల్డ్ రికార్డు సాధించిన కందేపి రాణి ప్రసాద్

– బ్రిటిష్ వరల్డ్ రికార్డ్ అందుకున్న సిరిసిల్ల బాల సాహితీవేత్త
నవ తెలంగాణ సిరిసిల్ల
బాల సాహితీవేత్త కందేపి రాణి ప్రసాద్ కు బ్రిటిష్ వరల్డ్ రికార్డ్ దక్కింది. మానవ దేహంలోని అవయవాలు ఆసుపత్రి యంత్ర పరికరాలకు పొడుపు కథలు రాసి ఆసుపత్రిలో ప్రజల కోసం ఉంచి ప్రజలను చైతన్యం చేస్తుండడంతో ఆమెకు ఈ రికార్డు దక్కింది. ఆమె వివిధ పొడుపు కథలు రాసి ఆసుపత్రి గోడలకు అంటించారు. శరీర అంగాలు చేసే పనిని ఆమె పొడుపు కథల ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్నారు. రాణి ప్రసాద్ బాల సాహిత్యంలో ఇప్పటికే 50 పుస్తకాలు రాసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే విశిష్ట మహిళ పురస్కారం ను ఆమె అందుకుంది.