మహిళా కాంగ్రెస్ కమిటీ నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్లగొండ పట్టణానికి చెందిన కందిమళ్ల నాగమణి రెడ్డిని జిల్లా కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు గోపగాని మాధవి నియమించారు.శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్బంగా నాగమణి రెడ్డి మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ ,కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్,జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.