సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శిగా కందూరి చంద్రశేఖర్ 

నవతెలంగాణ – కామారెడ్డి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కామారెడ్డి జిల్లా మహాసభలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ మహాసభలలో నూతన కమిటీని ఎన్నుకోన్నారు. నూతన జిల్లా కార్యదర్శిగా కందూరి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా ఎస్.వెంకట్ గౌడ్, మోతీరాం, కొత్త నరసింహులు, జిల్లా కమిటీ సభ్యులుగా రవీందర్, సురేష్ గొండ, ముదాం అరుణ్, రేణుక, ఖలీల్, అజయ్ లను ఎన్నుకోన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేసి ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని వాటికి వ్యతిరేకంగా ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.