కంగువ.. అద్భుతమైన సినిమా : హీరో సూర్య

కంగువ.. అద్భుతమైన సినిమా : హీరో సూర్యహీరో సూర్య నటిస్తున్న భారీ చిత్రం ‘కంగువ’. ఈ చిత్రాన్ని పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హ్యూజ్‌ బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సినిమా నవంబర్‌ 14న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు వస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు శివ మాట్లాడుతూ, ‘వెయ్యేళ్ల కిందట ఆదిమానవుల టైమ్‌ నుంచి ఐదు తెగల మధ్య జరిగే పోరాటాన్ని నేపథ్యంగా ఎంచుకుని స్క్రిప్ట్‌ తయారు చేశాం. ట్రైలర్‌ చూసినప్పుడు ఎలాంటి గొప్ప ఫీలింగ్‌ కలిగిందో థియేటర్‌లోనూ అలాంటి అనుభూతికి లోనవుతారు’ అని తెలిపారు. ‘అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమకు కతజ్ఞతగా వారికి గొప్ప సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలనే ‘కంగువ’ లాంటి గొప్ప సినిమా చేశాను. ఇది ఇప్పటివరకు స్క్రీన్‌ మీద మీరు చూడని ఒక అరుదైన అద్భుతమైన సినిమా. దర్శకుడు శివ వల్లే ఇది సాధ్యమైంది. ఇలాంటి సినిమాలు చేసేందుకు దర్శకుడు రాజమౌళి స్ఫూర్తినిచ్చారు’ అని హీరో సూర్య అన్నారు.