
మోపాల్ మండలంలోని కంజర శివారులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/ కళాశాల యందు 10 వ తరగతి చదువుతున్న ఏం. సిరివల్లి బాక్సింగ్ అకాడమీకి ఎంపికై వరంగల్, ఆదిలాబాద్, షేక్పేట్ లలో రాష్ట్రస్థాయి పోటీలలో 3 సార్లు బంగారు పతకం మరియు రంగారెడ్డి లో రాష్ట్ర స్థాయి పోటీలో కాంస్య పతకం సాధించి, నిజామాబాద్ ఎస్ జి ఎఫ్ డిస్ట్రిక్ మీట్ లో 2 సార్లు పాల్గొని, ఢిల్లీ ఎస్ జి ఎఫ్ కు ఎంపికై జాతీయ స్థాయి పోటీలలో భాగం పంచుకోవడం పాఠశాలకే కాకుండా మొత్తం జిల్లాకే గర్వకారణం గా నిలించిందని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జి విజయ లలిత విద్యార్థిని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాల విద్యార్థులకు సిరివల్లి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు విద్యార్థినిని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడి ఉదయశీల, ఎస్ వి పి వినోద, జె వి పి సునీత, పి ఈ టీ లత ఇంకా ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.