
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పోట్టేవాని తండ గ్రామపంచాయతీకి చెందిన రమావత్ వనిత (30)అనారోగ్యం తో మంగళవారం మృతి చెందారు. అంత్యక్రియలో పాల్గొని కడవరి చూపు చూసేందుకు వచ్చిన బంధు మిత్రులకు భారతీయ జనతా పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గ బిజెపి ఇంఛార్జి, ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ఛైర్మెన్ కంకణాల నివేదితరెడ్డి దాదాపు 200 మందికి తన ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు దేగవత్ జగన్ నాయక్, ఆ గ్రామ బూత్ అధ్యకుడు రమావత్ హరిబాబు నాయక్, మరియు అంగోత్ సేవ నాయక్, బాణావత్ సాయి నాయక్, బంధువులు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.