మోహన్ బాబు, విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు ప్రమోషన్స్‌ని కూడా ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషనల్ టూర్‌లో భాగంగా ‘కన్నప్ప’ టీమ్ దేశవ్యాప్తంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శిస్తోంది. ఈ క్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని మోహన్ బాబు, విష్ణు మంచు కలిశారు. ఈ టూర్‌లో శరత్ కుమార్, ముఖేష్ రిషి, వినరు మహేశ్వరి కూడా పాల్గొని, సందడి చేశారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అతిథి మర్యాదలకు, సాదర స్వాగతాలకు ‘కన్నప్ప’ టీం హదయపూర్వక కతజ్ఞతలు తెలిపింది. ప్రముఖ తెలుగు కళాకారుడు రమేష్ గొరిజాల గీసిన అందమైన పెయింటింగ్‌ను ముఖ్యమంత్రికి విష్ణు మంచు బహుకరించారు. ‘కన్నప్ప’ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని, అందరి అంచనాలకు దీటుగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ అన్నారు.