రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చేయాలని తాము చెప్పిన వినకుండా ఏకపక్షంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఓ వర్గానికి వత్తసు పలికేల బిల్లును అమోదించడం సరైంది కాదని మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కోప్పుల రమేష్ అన్నారు. బుధవారం సంఘం ఆధ్వర్యంలో సీఎం తీరును నిరసిస్తూ కలెక్టర్ చౌక్ లో నిరసన తెలిపారు. అనంతరం సీఎం ఫ్లెక్సీని దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు వాటిని లాక్కున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరగడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. అనంతరం రోడ్డుపై బైటాయించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొప్పుల రమేష్ మాట్లాడుతూ… ఎస్సీలోని మాల, మాదిగలను విడగొట్టేల సీఎం రేవంత్ మంగళవారం ఎస్సీ వర్గీకరణ బిల్లును అమోదించారన్నారు. 16 ఉప కులాలున్న మాదిగలకు 9 శాతం, 26 ఉప కులాలున్న మాలలకు కేవలం 5 శాతం కేటాయించారన్నారు. తాము వర్గీకరణకు వ్యతిరేకం కాదని కానీ రాజ్యాంగ బద్దంగా 341 ఆర్టికల్ ప్రకారం కాకుండా ఏకపక్షంగా 1, 2, 3 కేటాగిరిలను ఏర్పాటు చేశారన్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో మాలలు అని సూచించే విధంగా ఎక్కడ పొందుపర్చాలేదన్నారు. మాలలు రాష్ట్రంలో లేరని చెప్పడంతో శక్తిని ప్రదర్శించేలా గత డిసెంబర్ లో హైదరాబాద్లో సింహాగర్జన నిర్వహించామన్నారు. దానిపై కూడా కాంగ్రెస్ విమర్శలు చేసిందనారు. వచ్చే ఎన్నికల్లో మాలల శక్తిని కాంగ్రెస్ కు చూపిస్తు బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సుధాకర్, మేకల మల్లన్న, అశోక్, రాజేశ్వర్, మెట్టు ప్రహ్లాద్, జగదీష్, రమేష్, ప్రదీప్, భూమన్న, ఉశన్న, లింగన్న పాల్గొన్నారు.