కంటివెలుగు పథకం దేశానికే ఆదర్శం

నవతెలంగాణ-కోదాడరూరల్‌
కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శమని ఎంపీటీసీ శంకర్‌శెట్టి కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని కూచిపూడి తండా గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీఓ తుమ్మల నాగేశ్వరావు, సర్పంచ్‌ భూక్యాసైదాతో కలిసి ప్రారంభించి మాట్లాడారు.నేత్ర సంబంధిత వ్యాధిగ్రస్తులల కొరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం కంటివెలుగు పథకం ద్వారా అవసరమైన వారికి ఉచిత కళ్ళద్దాలు, మందులు పంపిణీి చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.వయస్సురీత్యా 50 ఏండ్లు నిండిన, నేత్ర సమస్యలు ఉన్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్‌ వాణిశివప్రియ, హేమంత్‌, సుజాత, ఏఎన్‌ఎం సంతోషమ్మ, ఆశావర్కర్స్‌ అన్నమ్మ, పద్మ, సువార్త, సుశీల, అలివేలు, గ్రామపంచాయతి సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌ : జనవరి 18 నుండి నేటి వరకు వివిధ వార్డులలో కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ముగించినట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చన రవి తెలిపారు.మున్సిపాలిటీ పరిధిలో 10331 మందికి మందికి పరీక్షించి 2172 మందికి కళ్లద్దాలు అందజేశామన్నారు.787 మందికి ఆటల ద్వారా అద్దాలు అందజేశామని, 1863 మందికి కంటి ఆపరేషన్‌ చేశామన్నారు.ఐదునెలలుగా సేవలందించిన కంటి వెలుగు సిబ్బందిని అభినం దించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మెన్‌ జక్కుల నాగేశ్వరరావు, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఇందిరాల రామకృష్ణ,డాక్టర్‌ సుష్మ, మల్లిక,డేటా ఎంట్రీ ఆపరేటర్‌ శివ ,హైమావతి, కవిత, తదితరులు పాల్గొన్నారు.