కరాటే చాంప్స్‌ చరణ్య, జయంతి

హైదరాబాద్‌ : ఏపీ, తెలంగాణ ఐసిఎస్‌ఈ, ఐఎస్‌సి రీజినల్‌ జాతీయ కరాటే చాంపియన్‌షిప్స్‌లో చరణ్య, జయంతి విజేతలుగా నిలిచారు. కింగ్‌కోఠిలోని సెయింట్‌ జార్జ్‌ గర్ల్స్‌ గ్రామర్‌ స్కూల్‌లో జరిగిన అండర్‌-14 (26-30 కేజీలు) గర్ల్స్‌ ఫైనల్లో సాయి హర్షితపై పి. జయంతి 8-3తో గెలుపొందింది. 30-34 కేజీల విభాగంలో 2-0తో అంజలిపై విజయం సాధించిన చరణ్య టైటిల్‌ అందుకుంది. 34-38 కేజీల విభాగంలో మార్యమ్‌, 34-38 కేజీల విభాగంలో లీలా జేన్‌, 42-46 కేజీల విభాగంలో సిరి, ఓవర్‌ 50 కేజీల విభాగంలో స్వాతి విజేతలుగా నిలిచారు. విజేతలకు సెయింట్‌ జార్జ్‌ గర్ల్స్‌ గ్రామర్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మార్లీన్‌ ఏస్తర్‌ బహుమతులు ప్రదానం చేశారు.