హైదరాబాద్ : తెలంగాణలో క్రీడా రంగం నవ్య పథంలో పయనిస్తుందని శాట్స్ చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జాతీయ కరాటే, కుంగ్‌ఫూ చాంపియన్‌షిప్స్‌ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ‘స్వరాష్ట్రంలో క్రీడా రంగంలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. మౌళిక వసతులు, ఆధునాతన సదుపాయాల కల్పనతో గ్రామీణ ప్రాంతాల నుంచి చాంపియన్లు తయారయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాట వేసింది. తెలంగాణలో క్రీడా రంగం నవ్య పథంలో పయనిస్తుందని’ ఆంజనేయ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో సినీ హీరో సుమన్, టోర్నీ నిర్వాహకులు కరాటే రాజు తదితరులు పాల్గొన్నారు.