రాణి లక్ష్మీ బాయి ఆత్మ పరిశిక్ష పథకంలో భాగంగా, విద్యార్థినుల ఆత్మరక్షణకై ప్రవేశపెట్టబడిన కరాటే శిక్షణ కోసం ఏర్గట్ల కేజీబీవీ పాఠశాల,తడపాకల్, తాళ్ళ రాంపూర్,గుమ్మిర్యాల్,తొర్తి ప్రభుత్వ పాఠశాలలు ఎంపికైనట్లు ఎంఈఓ ఆనంద్ రావ్ తెలిపారు. ఎంపికైన పాఠశాలలకు సోమవారం నుండి కరాటే శిక్షణ ప్రారంభించడం జరిగిందని,మూడు నెలల పాటు శిక్షణ కొనసాగుతుందని అన్నారు. ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్,అబ్దుల్ జావీద్,పీఈటి ఆనంద్,కరాటే మాస్టర్ అవినాష్ పాల్గొన్నారు.