గుండెపోటుతో కరీంనగర్‌ డీఐఈఓ మృతి

నవతెలంగాణ – కరీంనగర్‌
కరీంనగర్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి(డీఐఈఓ) టి.రాజ్యలక్ష్మి శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. మూడున్నరేండ్లుగా డీఐఈఓ(ఎఫ్‌ఏసీ)గా సేవలందిస్తునారు. టైపిస్ట్‌గా ఉద్యోగంలో చేరి, జూనియర్‌ లెక్చరర్‌, ప్రిన్సిపాల్‌, డీఐఈఓ స్థాయికి చేరుకున్నారు. ఆమె భర్త పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో రిటైరయ్యారు. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కరీంనగర్‌లోని చైతన్యపురిలో గల ఆమె నివాసంలో మృతదేహాన్ని ఉంచారు. జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌, అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మెన్‌ డాక్టర్‌ వి.నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, జూనియర్‌ లెక్చరర్స్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌, డీఐఈఓ ఆఫీస్‌ స్టాఫ్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె సేవలను కొనియాడారు. కాగా, రాజ్యలకిë మృతి పట్ల జిల్లా మంత్రి గంగుల కమలాకర్‌ సంతాపం ప్రకటించారు.