కరీంనగర్‌ను రాజకీయంగా వాడుకున్నారు

– పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమాణారావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కరీంనగర్‌ జిల్లా కేసీఆర్‌ను, ఆ కుటుంబాన్ని రాజకీయంగా కొన్ని దశాబ్ధాలుగా బతికించిందని పెద్దపల్లి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విజయరమాణారావు గుర్తు చేశారు. అయినా ఆ జిల్లాకు ఏం చేయలేదన్నారు. శనివారం శాసనసభలో ఆయన సాగునీటి ప్రాజెక్టుల శ్వేతపత్రంపై ఆయన మాట్లాడారు. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుని, ఆ జిల్లా ప్రజలకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేదన వ్యక్తంచేశారు. ఇన్నాళ్లు ప్రాజెక్టు వద్దకు మీరేం పీకనికపోయారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైపు లైన్లు పెద్దపల్లి జిల్లా మీదుగా పోతున్నా… ఒక ఎకరాకు నీళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ ద్వారా పెద్దపల్లి చివరి ఆయకట్టుకు నీరిస్తామన్న కేసీఆర్‌… చుక్కనీరివ్వలేదని విమర్శించారు. షెట్టర్లకు మరమ్మత్తులు చేయలేదన్నారు. గజ్వేల్‌, సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు అభివృద్ధి చేసి, రాష్ట్ర మంతా అభివృద్ధి చేసినట్టు భ్రమలు కల్పించారని విమర్శించారు.పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో చిన్న కాళేశ్వరాన్ని కూడా పూర్తి చేయలేదన్నారు.