
చండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి కి తెలంగాణ సాయుధ పోరాట యోధులు కర్క ముత్తారెడ్డి స్మారక పురస్కారానికి ఎంపికైనట్లు విజ్ఞాన వికాస మండలి కన్వీనర్ వి. సుమలత, వ్యవస్థాపక అధ్యక్షులు మధుకర్ వైద్యుల ప్రకటనలో తెలిపారు. ఆ మండలి నిర్వహించిన రెండు తెలుగు రాష్ట్రాల కవితల పోటీలో బుచ్చిరెడ్డి (నల్గొండ ) తో పాటు ఎన్. లహరి( హైదరాబాద్), జి. వి. రమణ (అనంతపురం ), ఆలేటి పరంజ్యోతి( ఖమ్మం ), రాకుమారి (పెద్దపల్లి ) ని ఎంపిక చేసినట్లు బుధవారం తెలిపారు. వీరితో పాటు మరో ముగ్గురికి ప్రోత్సాహ బహుమతుల కింద ఎంపిక చేసి, వీరందరికి త్వరలో హైదరాబాదులో జరిగే 31వ వార్షికోత్సవంలో పురస్కారాలు అందజేయున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. బుచ్చిరెడ్డి పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం, కవులు, రచయితలు అభినందనలు తెలిపారు.