– విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల
నవతెలంగాణ-వలిగొండ రూరల్
ఇటీవల అనారోగ్యంతో మతి చెందిన రాజకీయ నేత వంగాల స్వామి గౌడ్ దశదిన కర్మను ఆయన స్వగ్రామం నెమిలకాల్వలో శనివారం నిర్వహించారు. ఈ దశదినకర్మలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పాల్గొని స్వామి గౌడ్‌చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. మంత్రితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్లశేఖర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర గీతకార్పోరేషన్ చైర్మన్ పల్లే రవికుమార్, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్, బీఆర్‌ఎస్‌రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ ఉద్యమ నేత చెరుకు సుధాకర్, వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ పైళ్ల రాజవర్ధన్ రెడ్డి, వంగాల వెంకన్న, బీఆర్‌ఎస్ మండల పార్టీఅధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్, గూడూరు శివశాంత్ రెడ్డి, గూడూరు శ్రీధర్ రెడ్డి, కొమిరెల్లి సంజీవరెడ్డి తదితరులునివాళి అర్పించారు.