పాన్‌ ఇండియా రేంజ్‌లో ‘కర్మ స్థలం’

'Karma Vaatan' in Pan India Rangeరాయ్ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై శ్రీనివాస్‌ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’. అర్చన శాస్త్రి, మితాలి చౌహాన్‌, వినోద్‌ అల్వా, కలకేయ ప్రభాకర్‌, బాలగం సంజయ్, నాగ మహేష్‌, దిల్‌ రమేష్‌, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. హీరోయిన్‌ అర్చన మాట్లాడుతూ, ‘మహిషాసుర మర్దిని కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇంత మంచి సబ్జెక్ట్‌ని, ‘కర్మ స్థలం’  వంటి అద్భుతమైన టైటిల్‌తో సినిమాను తెరకెక్కించిన రాకీకి థ్యాంక్స్‌. నిర్మాత శ్రీనివాస్‌ సహకారంతో దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఈ  మూవీ పాన్‌ ఇండియ స్థాయిలో ఉంటుంది’ అని తెలిపారు. ‘పాన్‌ ఇండియా రేంజ్‌లో ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. నిర్మాత శ్రీనివాస్‌ నా వెన్నంటి ఉండి నడిపించారు.  అర్చన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆమె అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. ఎం.ఎల్‌ రాజా మంచి సంగీతాన్ని అందించారు’ అని దర్శకుడు రాకీ షెర్మన్‌  చెప్పారు. నిర్మాత శ్రీనివాస్‌ సుబ్రహ్మణ్య మాట్లాడుతూ, ‘ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని తెలిపారు.