– సెమీస్‌లో హర్యానాపై ఐదు వికెట్ల తేడాతో గెలుపు
– విజయ్ హజారే వన్డే టోర్నీ
వడోధర: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ ఫైనల్లోకి కర్నాటక జట్టు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో కర్ణాటక జట్టు ఐదు వికెట్ల తేడాతో హర్యానాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హర్యానా జట్టును కర్నాటక బౌలర్లు కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 237పరుగులే చేసింది. కర్ణాటక బౌలర్లు అభిలాష్ శెట్టి(4/34), శ్రేయస్ గోపాల్(2/36), ప్రసిధ్ కృష్ణ(2/40) రాణించారు. దీంతో ఆ జట్టు 50ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 237పరుగులే చేసింది. హర్యానా బ్యాటర్లలో హిమాన్షు రాణా(44), కెప్టెన్ అంకిత్(48), రాహుల్ తెవాటియా(22), సుమిత్ కుమార్(21) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఛేదనలో కర్ణాటక ఓపెనర్, కెప్టెన్ మయాంక్ అగర్వాల్(0) డకౌటైనా.. దేవదత్ పడిక్కల్(86), స్మరణ్ రవిచంద్రన్(76) అర్ధసెంచరీలకి తోడు చివర్లో శ్రేయస్ గోపాల్(23; 20బంతుల్లో 3ఫోర్లు) మ్యాచ్‌ను ముగించాడు. దీంతో కర్ణాటక జట్టు 47.2ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 238పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. రెండో సెమీస్ విదర్భ-మహారాష్ట్రల మధ్య గురువారం జరగనుంది.