మేడ్చల్ బీఆర్ఎస్ ఎస్సీ సెల అధ్యక్షుడిగా కర్రె బలరాం

– అభినందనలు తెలిపిన రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్: మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల అధ్యక్షుడిగా పీర్జాదిగూడ నగర పాలక సంస్థకు చెందిన సీనియర్ నాయకుడు కర్రె బలరాం నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆయన నివాసంలో బలరాం కు నియామక పత్రాన్ని అందించి అభినందించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనందుకు ధన్యవాదాలు తెలిపారు. పదవీ రావడానికి నాకు సహకరించిన పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.