అకాల వర్షంతో, కోసి ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. మండల కేంద్రంలో మంగళవారం ఒకసారిగా కురిసిన అకాల వర్షానికి రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం కొట్టుకుపోవడం రైతును కలచివేసింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు గత 20 రోజుల క్రితం ప్రారంబాలకు వచ్చి, కొబ్బరికాయలు కొట్టి వెళ్లారు గాని, కొనుగోలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా.. ప్రభుత్వ అలసత్వానికి ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటి పాలు అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అలసత్వమే నష్టానికి కారణమని, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే కాంటాలు ప్రారంభించి, కేంద్రాల నుండి వరి ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు.