నియోజకవర్గ సమస్యల పరిష్కారం కొరకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని.. ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటానని కార్తీక ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కత్తి కార్తీక్ గౌడ్ హామీ ఇచ్చారు. కార్తీక గౌడ్ 44 వ జన్మదిన వేడుకలు శనివారం దుబ్బాకలో ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకుల మధ్య కార్తీక గౌడ్ భారీ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,కార్తీక గౌడ్ అభిమానులు పాల్గొన్నారు.