హీరో కార్తీక్ రాజు నటించిన ‘అథర్వ’ రిలీజ్‌కు సిద్దంగా ఉండగానే.. మరో చిత్రాన్ని పట్టాలెక్కిం చారు. కాసు క్రియేషన్స్ బ్యానర్ పై కాసు రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘హస్తినాపురం’. కార్తీక్ రాజు హీరోగా రాజా గండ్రోతు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తాజాగా ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి భీమనేని శ్రీనివాసరావు క్లాప్ కొట్టగా, నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు వి.ఎన్.ఆదిత్య స్క్రిప్ట్ అంద జేశారు. ఈ సందర్భంగా నిర్మాత కాసు రమేష్ మాట్లాడుతూ, ‘కార్తీక్ రాజు వద్ద మేకప్ మెన్, మేనేజర్‌గా ఉండేవాడ్ని. ఆయన నన్ను నిర్మాతను చేశారు. మా డైరెక్టర్ రాజా వివి వినాయక్ వద్ద అసిస్టెంట్‌గా పని చేశారు. కథలో దమ్ముంది కాబట్టే నిర్మిస్తున్నాం. మా చిత్రాన్ని ఆదిరించండి’ అని అన్నారు. ‘హస్తినాపురం కొత్త పాయింట్‌తో రాబోతోంది. రెగ్యులర్ చిత్రంలా ఉండదు. మా డైరెక్టర్ అద్భుతంగా కథ రాసుకున్నారు. మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ ఆల్రెడీ హనుమాన్ సాంగ్‌తో ట్రెండింగ్‌లో ఉన్నారు’ అని హీరో కార్తీక్ రాజు చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ, ‘రాజా ఓ మంచి కథతో రాబోతున్నారు. కార్తీక్ రాజుతో నాకు ఇది రెండో చిత్రం. ఈ చిత్రానికి పని చేయడం ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’ అని అన్నారు. ‘హస్తినాపురం అనే టైటిల్ వినగానే ఎంత పాజిటివిటీ ఉందో.. సినిమా కూడా అంతే ఉంటుంది. నా గురువు వినాయక్ గారి దగ్గర పని చేశాను. మంచి కథ, మంచి టీంతో రాబోతున్నాం. మా అందరినీ ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాను’ అని దర్శకుడు రాజా గండ్రోతు చెప్పారు. హీరోయిన్ నిషా మాట్లాడుతూ, ‘తెలుగులో మళ్లీ సినిమాను చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇలాంటి డిఫరెంట్ మూవీలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపారు.