– రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఇబ్రహీంపట్నం కేంద్రంలోని కార్తికేయ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సష్టించారు. ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభను చాటుకున్నారని కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకాంత్ తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎం.రోహిణి, జి.స్పందనకు 470 మార్కులను గాను 467, బైపీపీలో శ్రావణికి 440 మార్కులను గాను 435 మార్కులు, సీఈసీ విభాగంలో ప్రీతీక 500 మార్కులను గాను 485 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎ.హసీని 1000 మార్కులకు గాను 988 మార్కులు, బైపీసీ విభాగంలో శాధియ ముస్కాన్ 1000 మార్కులను గాను 983 మార్కులు, సీఈసీ విభాగంలో ఎస్.సౌమ్య 1000 మార్కులకు గాను 967 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మొదటి సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో ఎం.రోహిణి, జి. స్పందనలు 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించారు. వీరంతా రాష్ట్ర స్థాయిలో కార్పొరేట్ కళాశాల విద్యార్థులతో పోటీపడి ఉత్తమ ఫలితాలు సాధించారని కార్తికేయ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకాంత్ పేర్కొన్నారు. అధ్యాపకులు అందించిన బోధనే తమ కళాశాల విద్యార్థులకు మెరుగైన ఫలితాలను తెచ్చిపెట్టిందని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యలో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరచడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా తమ కళాశాల పనిచేస్తుందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేస్తూ అన్ని విధాలుగా విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో విద్యాబోధన చేస్తున్నట్టు వివరించారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల బంగారు భవిష్యత్తును చక్కదిద్దాలనే లక్ష్యంతో తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్నామని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం ద్వారానే జీవితంలో విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో చదివితే అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చునని తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో కార్తికేయ కళాశాల స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను అభినందించిన వారిలో కళాశాల అధ్యాపక బందం జంగయ్య, కుమార్, మహేందర్, శివకష్ణ, నాగరాజు, మల్లేష్, రాజశేఖర్, నాగరాణి, నవనీత, తస్నిమ్, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.