దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తికమాసం తొలిరోజు కావడంతో ధర్మగుండ పుష్కరిలో పుణ్యస్నాల ఆచరించి శనివారం తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కంటి సన్నిధిలో మహిళలు దీపాలు వెలిగించి, బ్రాహ్మణులకు దీపదానం చేశారు. వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో కార్తిక వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి కల్యాణ మండపంలో కార్తిక పురాణ ప్రవచనాల పారాయణం నిర్వహించారు. రాజన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. సాయంత్రం సామూహిక కార్తిక దీపోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. ఎప్పటికప్పుడు అధికారులను దేశానిర్దేశం చేస్తూ దేవాలయ ఈవో వినోద్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.