కార్తీకమాస వనమహోత్సవం..

Kartikama Vanamahotsavam..నవతెలంగాణ – చండూరు
నార్కట్పల్లి సమీపంలోని అక్కినేపల్లి సాలగ్రామ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద చండూర్ ఆర్యవైశ్య పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజన కార్యక్రమనీ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భోజన వసతి దాత నెర్మట వాస్తవ్యులు మిట్టపల్లి రాజు ఏర్పాటు చేశారు. చండూరు మండల ఆర్యవైశ్యులు, నల్లగొండ, హైదరాబాద్ ఆర్యవైశ్య ప్రముఖులు ఆదివారం రోజు ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తేలుకుంట్ల చంద్రశేఖర్, మండల అధ్యక్షులు తడకమల్ల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి తాడిశెట్టి వెంకన్న, కోశాధికారి దాచేపల్లి సంపత్, పట్టణ అధ్యక్షులు తాడిశెట్టి సంతోష్, కార్యదర్శి వాస రాంబాబు, కోశాధికారి సోమవరపు చంద్రుడు, వాసవి మాత గుడి అధ్యక్షులు తేలుకుంట్ల జానయ్య, వార్డ్ కౌన్సిలర్ మంచుకొండ కీర్తి సంజయ్, వాసవి మాత గుడి కోశాధికారి బిక్కుమాండ్ల విశ్వనాధం, తదితరులు పాల్గొన్నారు.