
– ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని భూపతిపురం అన్నారం గ్రామాలలో కారుకొండ సడలమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర ఏప్రిల్ 24 ప్రారంభమై మే 4వ తారీఖు శనివారం వన ప్రవేశంతో ముగుస్తుంది. ఆదివాసీలు బేరంబోయిన వంశం 6 గట్టు కు సంబంధించిన ఎట్టి, మైపతి, అన్నారం, కుడుముల, దన్నూరి, ఆత్రం, వంశస్థులు ఈ జాతరను నిర్వహిస్తారు. తల్లడి, ఈసం వంశీయులు వడ్డెలుగా వ్యవహరిస్తున్నారు. జాతర అంగరంగ వైభవంగా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఆదివాసీ నృత్యాలతో, డోలు వాయిద్యాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. సందర్శకులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ జాతరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి, సహకరించాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, గ్రామ పెద్ద బడే రాంబాబు, ఎట్టి వంశస్థులు ఎట్టి లింగయ్య ప్రకాష్ ఎట్టి నాగేష్ ఎట్టి వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు తల్లి లక్ష్మయ్య తాటి మల్లయ్య తాటి లక్ష్మయ్య నరసయ్య, ఎట్టి రాములు, ఎట్టి లక్ష్మయ్య, కళ్యాణ్, బచ్చలి వెంకటేశ్వర్లు, కుడుముల సూరయ్య, గ్రామ పెద్దలు గ్రామస్తులు ఆదివాసి సంఘాల నాయకులు, మహిళలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.