– జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
టోక్యో: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ప్రి క్వార్టర్స్‌కు చేరిన ఏకైక షట్లర్ సతీశ్ కరుణాకరన్ పోరాడి ఓటమిపాలయ్యాడు. గురువారం జరిగిన ప్రి క్వార్టర్స్ పోటీలో కరుణాకరన్ 21-18, 18-21, 8-21తో వాంగ్‌ఛరణ్(థారులాండ్) చేతిలో పరాజయాన్ని చవిచూసాడు. రెండోరౌండ్‌లో ఆంటోన్సెన్(డెన్మార్క్) గాయంతో నిష్క్రమించడంతో ప్రి క్వార్టర్స్‌కు చేరిన కరుణాకరణ్ పోరాడినా ప్రయోజనం లేకపోయింది. అంతకుముందు కిరణ్ జార్జి 19-21, 14-21తో సునేయమా(జపాన్) చేతిలో ఓడాడు.