హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో 25.1 శాతం వృద్ధితో రూ.473.60 కోట్ల నికర లాభాలు సాధించినట్టు కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.378.45 కోట్ల లాభాలు నమోదు చేసింది.
ఇదే సమయంలో రూ.2,336 కోట్లుగా ఉన్న బ్యాంక్ మొత్తం ఆదాయం.. గడిచిన క్యూ2లో రూ.2,856 కోట్లకు చేరింది. నిర్వహణ వ్యయాలు రూ.715.72 కోట్లుగా నమోదయ్యాయి. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 1.73 శాతం నుంచి 1.10 శాతానికి తగ్గినట్టు తెలిపింది.