ప్రచారంలో దూసుకుపోతున్న కసిరెడ్డి మాధవి

నవతెలంగాణ-ఆమనగల్:  కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి సతీమణి కసిరెడ్డి మాధవి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. హస్తం గుర్తుపై ఓటేసి తన భర్త నారాయణరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మంగళవారం ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని ముర్తూజపల్లి, సంకటోనిపల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు తెలగమల్ల జగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వస్పుల మానయ్య, సీనియర్ నాయకులు అవ్వారి శివలింగం,  యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణ నాయక్, అలీం, సురేష్ నాయక్, నాసర్, వస్పుల శ్రీకాంత్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.