– టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్
– కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ఆర్ సీపీ నాయకులు
నవతెలంగాణ-ఆమనగల్
కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం ఆమనగల్ పట్టణానికి చెందిన పలువురు వైఎస్‌ఆర్ సీపీ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా కసిరెడ్డి నారాయణరెడ్డి, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, బాలాజీ సింగ్ తదితరులుతో కలిసి ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కండువాలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ, తెచ్చిన కాంగ్రెస్ రుణం తీర్చుకోవాలన్నారు. అంతకు ముందు పార్టీలో చేరుతున్న పలువురు నాయకులు మాట్లాడుతూ కల్వకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురడమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందని వారు పేర్కొన్నారు. మండల అధ్యక్షులు తెలగమల్ల జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు శ్రీపాతి శ్రీనివాస్‌రెడ్డి, అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు వస్పుల మానయ్య, సీనియర్ నాయకులు గౌస్ మైనొద్దీన్, ఖలీల్, షర్ఫద్దీన్, ఖాదర్ ఖాద్రీ, ఖాదర్, కృష్ణనాయక్, రహీం, కరీం, వస్పుల శ్రీకాంత్, నాసర్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.